తెలంగాణ ప్రభ (కోరుట్ల): వచ్చేనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల కోసంపాటల సిడిని ఆవిష్కరించారు
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంతకుముందు మాట్లాడిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రానున్నట్లు తెలిపారు
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డికి నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుండి అత్యధిక మెజారిటీ వస్తుందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువాడి కృష్ణారావు పేర్కొన్నారు
ఈ సిడిని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ల ఆధ్వర్యంలో రచయిత తేలుకంటి గంగాధర్ రచన గానం చేశారు
ఈ ఆవిష్కరణ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు బుస రాజేష్, అజయ్, బద్దం గౌతంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.