కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి

యూత్ నాయకులు పట్నం రినీష్ రెడ్డి

యూత్ కాంగ్రెస్ నాయకులుగా ముందుండి గెలిపిస్తాం

బంటు నరేష్, బత్తిన రాంకుమార్ గౌడ్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి లక్ష్యంగా గెలుపే పనిచేయాలని పట్నం రీనీష్ రెడ్డి  పిలుపునిచ్చారు . యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు నరేష్ ఆధ్వర్యంలో శనివారం  కుత్బుల్లాపూర్ లో ఏర్పాటుచేసిన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పట్నం రినీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపు లో యూత్ కాంగ్రెస్ పాత్ర అత్యంత కీలకంగా పోషించిందని, ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అదేవిధంగా పనిచేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని అన్నారు. పార్టీ గెలుపు కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరుణ్, కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తిన రామ్ కుమార్ గౌడ్, డోరా అరుణ్, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుజనాకర్ రెడ్డి, కొంపల్లి అధ్యక్షులు శివాజీ, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్, కార్యదర్శి పృథ్వీరాజ్, జాయింట్ సెక్రెటరీ రాకేష్ ముదిరాజ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.


.