కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలిపించాలి: కొలను హనుమంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ 

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): జగద్గిరిగుట్ట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి. ఈ సందర్భంగా వారి సమక్షంలో 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్, సయ్యద్ రషీద్, మహిళా నాయకురాలు మాజీ కౌన్సిలర్ వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

.