కోరుట్ల జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఉద్యోగ విరమణ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల  పాఠశాల యొక్క గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గడేల భూపతి ఉద్యోగ విరమణ సన్మానోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల బృందం, పూర్వ విద్యార్థులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ప్రముఖులు తదితరులు ఘనంగా శాలువాలతో సన్మానించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయులుగా పాఠశాల అభివృద్ధి కొరకు, విద్యార్థుల ఎదుగుదల కొరకు చేసిన సేవలు మరువలేవని కొనియాడారు. 

ఈ సందర్భంగా గడేల భూపతి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ సన్మానోత్సవంలో సన్మానించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ గత కొన్ని సంవత్సరాల నుండి నాకు సహకరించిన తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల విద్యార్థులు ఇప్పటివరకు మంచి క్రమశిక్షణతో ఉండి విద్యా పట్ల ఎంతో శ్రద్ధతో మంచి ర్యాంకులను సంపాదించి ఈ పాఠశాలకు, మా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఎంతగానో మంచి పేరు సంపాదించారు 

ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో మంచి ఉద్యోగాలు సంపాదించి, అధికారులుగా, నాయకులుగా, ఉపాధ్యాయులుగా చాలామంది ఎదిగారని వారిని చూస్తే ఎంతగానో ఆనందం కలుగుతుందని ఆయన తెలిపారు. 

ఇలాగే ఇకముందు కూడా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మంచి క్రమశిక్షణతో, శ్రద్ధతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఆయన కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థిని విద్యార్థుల బృందం, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, నాయకులు, అధికారులు, పాత్రికేయులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

.