అంబం (ఆర్) గ్రామం లో కుస్తీ పోటీలు

తెలంగాణ ప్రభ (కోటగిరి): రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని  మంగళవారం  గ్రామంలో పోచమ్మ గుడి దగ్గర కుస్థి పోటీలను నిర్వహించారు. పోటిల్లో మల్లాయోధులు ఆసక్తిగా పాల్గొని  కోటగిరి,వర్ని,రుద్రూర్,  మండలాలతో పాటు పక్క రాష్టృం మహారాష్ట్ర నుండి మల్ల యోధులు వచ్చి కుస్థి పోటిల్లో పాల్గొన్నారు. పోటిల్లో గెలుపొందిన మల్లాయోధులకు నగదు రూపంలో అందించారు. ఈ కుస్థి పోటీలను సంప్రదాయం ప్రకారం ప్రతి యేటా హనుమాన్ జయంతికి  సందర్భంగా  గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నావారు 

 గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శానం పోశెట్టి, కార్యదర్శి కమ్మరి రవి, గ్రామ పెద్దలు పట్టేపు రాములు, మంత్రి గంగారాం, అత్కూరి మహేష్, మంత్రి నర్సయ్య, హన్మాండ్లు, నాగనాథ్ తదితరులు ఉన్నారు

.