జగిత్యాలలో మానస హై స్కూల్ లో అంగరంగ” వైభవ్ “మెగా 2024 వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కేంద్రంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో” వైభవ్ “ది మనసా అన్యువల్ ఫెస్ట్ 2024 పేరు తో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 

పాఠశాల చైర్మన్ శ్రీమతి మంజుల రమాదేవి రవీందర్ రావు, పాఠశాల డైరెక్టర్ మౌనికా హరిచరణ్ రావు, మరియు పాఠశాల ప్రిన్సిపాల్ రజితరావు, జ్యోతి ప్రజ్వలన చేసి , హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులచే హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమం తో ప్రారంభించిన ఈ వేడుకలలో విద్యార్థిని విద్యార్థులు పలురకాల సాంస్కృతిక , జానపద నృత్యాలు ,వెస్ట్రన్ డాన్స్ లు,నాటికలు , విద్యార్థుల తల్లీదండ్రులకు నిర్వహించిన పోటీలు మొదలగు రకరకాల కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి 

అందులో తల్లి ప్రేమ మామనుకారం పై వేసిన నాటిక, గురువుల విలువను తెలిపే నాటిక,  ప్లాస్టిక్ నిషేధం పై చేసిన నృత్యం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రావు 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహించిన అన్ని పాఠశాల కార్యక్రమాలతో, సాధించిన విజయాలతో కూడిన నివేదికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తల్లిదండ్రులకు వివరించారు. 

ఈ కార్యక్రామంలో పాఠశాల డైరెక్టర్ లు శ్రీధర్ రావు , హరిచరణ్ రావు , మౌనిక రావు , సుమన్ రావు ,విద్యార్థులు , తల్లితండ్రులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.

.