హనుమాన్ జయంతి పురస్కరించుకొని పలు దేవాలయాలలో అర్చన, పూజలు చేసిన భక్తులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల పట్టణంలో హనుమాన్ జయంతి  ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో హనుమాన్ దేవాలయంలో  మొక్కులను చెల్లించుకున్న భక్తులు, టెంకాయ కొడుతూ తమలపాకులు సమర్పిస్తూ, తమ కోరికలు కోరుకున్నారు.

ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలలోభాగంగా పట్టణంలో పలు దేవాలయాలన్ని కూడా దర్శించుకున్నారు. 

రామ్ నగర్ లోని హనుమాన్, వీరబ్రహ్మేంద్రస్వామి, హనుమాన్ దేవాలయాలను కూడా దర్శించుకున్నారు. 

పట్టణంలో దేవాలయంలో పూజలు, అభిషేకాలు,చేస్తూ మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కల్లూరు రోడ్డు, హనుమాన్ దేవాలయం, రాంనగర్ దేవాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి హనుమాన్, మెయిన్ రోడ్ దేవాలయం, కొన్ని దేవాలయంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, హనుమాన్ స్వామిప్తె భక్తిని చాటారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

.