తాడూర్ లో కాలిన తాడిచెట్లను పరిశీలించిన బోయినపల్లి వినోద్ కుమార్
చెట్లను సంరక్షించే విధంగా ఏదైనా మార్గం ఉంటే శాస్త్రవేత్తలతో పరిశీలన చేయించాలని హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ నీరజ తో మాట్లాడిన బోయినపల్లి వినోద్ కుమార్
వర్షాకాలంలోగా తాటిచెట్లు చిగుర్లు రాకుంటే వీటి స్థానంలో పొట్టి తాళ్ళు పెట్టిస్తా
గీతకార్మికులు ఉపాధి కోల్పోయారు
ప్రభుత్వం తక్షణమే సాయమందించాలని జిల్లా కలెక్టర్ కు ఫోన్
తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తాటివనం కాలిపోవడంతో కల్లుగీసుకుని జీవనోపాధి పొందే గీతకార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం తాడూర్ ఎల్లమ్మ దేవాలయం వద్ద తాటివనం దగ్దమైన ప్రదేశాన్ని బీఆర్ఎస్ నాయకులు,గీతకార్మికులతో కలిసి ఆయన పరిశీలించారు. కాలిన తాటి చెట్లను పరిశీలించి వెంటనే హార్టికల్చర్ వైస్ చాన్స్ లర్ నీరజ గారితో ఫోన్లో మాట్లాడుతూ కాలిన తాటి చెట్లను ఏ మేరకు రక్షించవచ్చు,వెంటనే శాస్త్రవేత్తలను పంపించి కాలిన తాటి చెట్లను పరిశీలించే విధంగా చూడాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ తాటి చెట్లు దగ్దమై గీతకార్మికుల ఉపాధి పోయిందని వెంటనే వారిని ఆదుకోవాలన్నారు.
కాలిన తాటిచెట్లు వర్షాకాలంలోగా చిగురించకుంటే గతంలో నేను బీహార్ రాష్ట్రంలోని పాట్నా నుంచి పొట్టి తాటి విత్తనాలు తెప్పించి కరీంనగర్ పార్లమెంట్ పరిదీలోని గీతకార్నికులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.ఇప్పుడు కూడా పొట్టి తాటి విత్తనాలను నా సొంత ఖర్చులతో తీసుకురావడంతో పాటు ఒక వేళ నర్సరీలలో పొట్టి తాటి మొక్కలు దొరికిన కూడా కాలిన తాటి చెట్ల ప్రదేశంలో నాటించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ మానస రాజు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గీతకార్మికులు పాల్గొన్నారు.
.