తప్పుడు వార్తలను సోషల్ మీడియా,వాట్సాప్ గ్రూప్ ల లో వైరల్ చేసిన బిఆర్ఎస్ పార్టీ లాండ్ మాఫియా ....

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు సుదర్శన్ రెడ్డి

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కుత్బుల్లాపూర్ మండలం  సర్వే నెంబర్ 25/1, పేట్ బషీరాబాద్ లో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాల పై ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకుల ల్యాండ్ మాఫియా పై కందాడి సుదర్శన్ రెడ్డి  అనేక పిర్యాదులు చేసారు .ఇటీవల పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/1 వుడ్స్ కాలనీ సమీపం లో ప్రభుత్వ భూముల కబ్జాలను ఫోటోలను తీసిన సుదర్శన్ రెడ్డి తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ చెందిన ల్యాండ్ మాఫియా సుదర్శన్ రెడ్డి పై రెక్కీ నిర్వహించి శుక్రవారం మహిళలతో దాడి చేయించి దాడి దృశ్యాలను చిత్రీకరించి , సుదర్శన్ రెడ్డి  మహిళల అసభ్య  ఫోటోలు తీశారని  అని సోషల్ మీడియా  , వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ చేసారు. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన క్రిశాంక్, తెలుగు స్క్రైబ్ అనే పేరు తో ఉన్న ట్విట్టర్, పేస్ బుక్ అకౌంట్ ల ద్వారా ఈ తప్పుడు వార్తలు వైరల్ చేసారు. తనపై చేసిన తప్పుడు ప్రచారాలకు స్పందించిన సుదర్శన్ రెడ్డి, శనివారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో  పిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద

ఐపిసి 341,323,504,506-2, 500,r/w 34 కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.


.