ఎదురులేని విజేత బ్రాహ్మనందచారి

సూర్యుడి గుర్తుతో విజయ డంకా 

మైసమ్మ నగర్ ఏ సంక్షేమ సంగం ఎన్నికల్లో అధ్యక్షుడిగా మెజార్టీతో గెలుపు   

ఆశీర్వదించిన బస్తీ ప్రజలు-అభినందించిన ప్రజాప్రతినిధులు

బస్తీ అభివృద్దే ఆయన అభిమతం-ప్రేమ తత్వమే ఆయన మార్గం

కాలనీ అభివృద్ధి కి కృషి చేస్తా అంటున్న ప్రజా నాయకుడు బ్రహ్మనందచారి.                           

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తే ప్రజా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని నిస్వార్థంగా సేవ చేస్తే ప్రజా అభిమానం చూరగొనవచ్చునని నిరూపించాడు మైసమ్మ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్వాల బ్రహ్మానంద చారి.గత ముప్పై అయిదు సంవత్సరాలుగా బస్తితో వున్న అనుబంధంతో ఆ ప్రాంతంపై వున్న మమకారంతో అనునిత్యం బస్తీ అభివృద్ధికై పరితపించాడు.చిన్నా పెద్ద అందరిని ప్రేమతో పలకరిస్తూ బస్తీవాసులకు పెద్ద దిక్కుగా నిలిచాడు. అందుకే వారికి ఎల్లవేళలా చేదోడువాదోడుగా వుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బ్రహ్మాందచారిని ఈ నెల 14 న జరిగిన బస్తీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధ్యక్షుడిగా గెలిపించుకున్నారు.



మంచితనానికి మారుపేరు బ్రహ్మనందచారి:

బస్తీ నాయకుడిగా బాధ్యతయుతంగా స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిదులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాడు.పండగ వేళలో బస్తీవాసుల తో సందడి చేసే ఆయన కష్టకాలంలో సైతం వారికి అండగా ఉంటాడు.ఎమ్మెల్యే వివేకానంద కార్పొరేటర్ జగన్ సహకారంతో బస్తీ అభివృద్ధి కి బాటలు వేసాడు.డ్రైనేజి తాగునీరు కరెంటు రోడ్డు మరమ్మత్తు వంటివే కాకుండా కరోనా వంటి విపత్కర మహమ్మారి విలయతాండవం చేసిన రోజుల్లో స్థానిక ప్రజలకు భరోసా గా నిలిచాడు.బతుకమ్మ పండగ రోజున స్థానిక నాయకులతో కలిసి మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు.బస్తీలో వున్న ఆలయాల అభివృద్ధి కి కృషి చేస్తూ ప్రజా అభిమానం చూరగోన్నాడు.

ఎదురులేని విజేత: 

పోరాడే చేతికి కత్తి ఇవ్వాలి-మాట్లాడే నోటికే మైకివ్వాలి- ఊరిని ఉద్దరించే వారికే ఓటేయ్యాలి ఇదీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో బ్రాహ్మనంద చారి ప్యానల్ నినాదం. గంతంలో బస్తీ అభివృద్ధి కోసం వారు పనిచేసిన ప్రజా విశ్వాసం తో మొత్తం 346 ఓట్లు పోలవ్వగా అధ్యక్షుడిగా బ్రాహ్మనంద చారికి 263 ఓట్లు రాగా ప్రధాన కార్యదర్శిగా ధార ముకేశ్ 346 ఓట్లకుగాను 264 ఓట్లతో గెలుపొందారు.గతంలో బస్తీ అభివృద్ధికై బ్రహ్మానంద చారి ప్యానల్ చేసిన పనితీరుకు మెచ్చిన స్థానిక ప్రజలు 35 ఏళ్ల బస్తీ చరిత్ర లో జరిగిన మొదటి ఎన్నికల్లో బ్రహ్మానంద చారి ప్యానల్ సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు.

అభినందించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్: 

ముప్పై అయిదు ఏళ్ల మైసమ్మ నగర్ ఏ చరిత్ర లో మొట్ట మెదటి సారిగా జరిగిన సంక్షేమ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన అల్వాల. బ్రహ్మానంద చారి, ప్రధాన కార్యదర్శి గా గెలిచిన ధార. ముకేశ్ స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే కే. పీ వివేకానంద, కార్పొరేటర్ కే జగన్ ను వారి కార్యాలయాల్లో మర్యాదపుర్వకంగా కలిసారు.నూతనంగా ఎన్నికైన సంక్షేమ సంఘం నాయకులను ఎమ్మెల్యే, కార్పొరేటర్ లు అభినందించి శాలువాలతో సన్మానించారు.బస్తీలో అందరిని కలుపుకొనిపోవాలని మైసమ్మ నగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

.