జాతీయ బాబు జగ్జీవన్ రామ్ అవార్డు అందుకున్న ఆదిరెడ్డి

తెలంగాణ ప్రభ (కోరుట్ల):జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి  జాతీయ బాబు జగ్జీవన్ రామ్ ఎక్సలెన్స్ అవార్డు  అందుకున్నారు. 

మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షులు దాసరి స్వప్న, మహేష్ లు సోమవారం ఆన్ లైన్ లో ఏనుగు ఆదిరెడ్డి కి అవార్డు తో కూడిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ స్వాతంత్య్రం  కోసం కృషి చేసిన మహనీయుల పుట్టిన రోజు వేడుకలు జరుపడం, అలాగే సమాజ సేవ చేయడం, తదితర అంశాలపై ఆదిరెడ్డి కృషి చేసినందుకు  దేశ నాలుగవ డిప్యూటీ ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ పేరు మీద, జాతీయ బాబు జగ్జీవన్ రామ్ ఎక్సలేన్స్ అవార్డ్ వారికి పంపినట్లు దాసరి స్వప్న, మహేష్ తెలిపారు. 

అవార్డ్ అందుకున్న ఆదిరెడ్డినీ ఉపాద్యాయులు,మిత్రులు,విద్యార్థులు అభినందించారు.

.