మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న.
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో,కొత్తపల్లి, కోడిచర్ల, ఎత్తోండ,సోంపూర్,కరేగాం గ్రామాల్లో ఆదివారం డాక్టర్ బి.ఆర్. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు, ఆయన చిత్ర పటాలకు మండల ప్రజా ప్రతినిధులు, సంఘాల అధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి. 133వ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మాల మహానాడు అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న మాట్లాడుతూ.. అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడు అని అన్నారు. యువత అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు . గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని హక్కులకు అనుగుణంగా నడుచుకోవాలని యువతకు సూచించారు. నేడు సమాజంలో స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాము అంటే అంబేద్కర్ పుణ్యమే అని గుర్తు చేశారు. ఓటు హక్కును కల్పించింది అంబేద్కర్ అని కొనియాడారు. ఏప్రిల్ నెలలో మహనీయుల జయంతిని మండలాలలో, డివిజన్ పరిధిలో,జిల్లాలలో ఘనంగా జరుపుకుంటామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్, డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్ కొత్తపల్లి సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్,వాహిద్, కప్ప గణేష్, కిషోర్ బాబు, అనిల్ కులకర్ణి,హావగిర్ రావు పటేల్, బర్ల గంగారం ,పంచాయత్ రాజ్ రిటైర్మెంట్ ఏఈ మోరే కిషన్,అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బ్యాగరి రాములు, మాల మహానాడు ఉపాధ్యక్షులు పుప్పల సైదయ్య కాలే సాయిలు, గాయక్వాడ్ రాము, జంగం సాయిలు, పాల గంగారం, శివ శంకర్, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు దావులయ్య, పేగు.లాలయ్య, కన్నం శ్రీనివాస్, హెచ్. శ్రీకాంత్,హెచ్,రవి, ఆయా గ్రామాల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
.