నీటి ఎద్దడి లేకుండా గ్రామాలలో తగిన చర్యలు చేపట్టాలి

బోధన్ డిఎల్.పిఓ. సాయిబాబా.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని ఎత్తోండ, వల్లభాపూర్ గ్రామపంచాయతీలో వాటర్ ట్యాంక్ ల వద్దకు వెళ్లి వాటర్ ట్యాంక్ వద్ద   చుట్టుపక్కల   పరిసరాలను పరిశీలిస్తూ   నీటి సమస్యపై గ్రామపంచాయతీ సిబ్బందికి  వివరాలను అడిగి తెలుసుకున్నారు .ఎండాకాలం ఉన్నందున గ్రామాలలోని నీటి కొరత లేకుండా తగు చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ సిబ్బందికి ఆదేశించారు. గ్రామంలోని నీటి సరఫరా ప్రతిరోజు సక్రమంగా జరుగుతుందా లేదా అని  వివరాలను   గ్రామస్తులకు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని నీటి ఎద్దడిని లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఈవో ఉమాకాంత్ కు డి ఎల్ పి ఓ సాయిబాబా  ఆదేశించారు. నీటి ట్యాంకుల వద్ద పరిశుభ్రంగా ఉంచలన్నారు. క్లోరినేషన్ చేస్తూ పైప్ లైన్లు   లీకేజీలు లేకుండా   జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ కేఆర్.మనోహర్ రెడ్డి, 

ఆర్ డబ్ల్యు ఏఈ.  ధనరాజ్ పంచాయతీ ఈవో ఉమాకాంత్ సిబ్బంది తదితరులు ఉన్నారు

.