ఘనంగా శ్రీ శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం , కాంగ్రెస్ పార్టీ నేతలు 

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల  బొప్పాపూర్ గ్రామంలో ఆదివారం  శ్రీ శివ పంచాయతన ప్రాణ ప్రతిష్టా మహోత్సవం  అంబేద్కర్ మాల సంక్షేమ సంఘం  అధ్యక్షులు కొత్త నరసయ్య , ఉపాధ్యక్షులు గడ్డం శివకుమార్ ,  కరువు సభ్యులు బిస్క సత్యం , బత్తుల రాములు , గడ్డం నరేష్ , బెస్త దేవచంద్రం ఆధ్వర్యంలో   ఘనంగా జరిగింది,

ఆదివారం ఉదయం 6-30 గంటలకు కాలపూజ హోమం శాంతి పౌష్టిక హవనములు , ఘర్త సంస్కారం , రత్న దారు వ్యాసములు , యంత్ర ప్రతిష్ట మహోత్సవం మూర్తి స్థిరీకరణ కాలన్యాసం ప్రాణ ప్రతిష్ట మహా పూజ నేత్రులం బలిహరణములు స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది

ఈ కార్యక్రమం లో పాల్గొన్న భక్తకోటికి తీర్థప్రసాదాలు అన్నప్రసాదం వితరణ జరిగింది 

అనంతరం మండపోద్నసనలు బృందస్థానము రిత్విక్ సన్మానము గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ రాచర్ల విశ్వనాథ శర్మ , బ్రహ్మశ్రీ రాచంద్రా శ్రీనివాస్ శర్మ బృందం ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు, 

ఈ కార్యక్రమానికి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజర్ కాగా వారితో  పత్యేక పూజలు నిర్వహించారు ,  అనంతరం మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు,  అనంతరం సత్యంకు ఆలయ పూజారులు ఆశీర్వచనాలు అందజేశారు, 

      ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , రేవంత్ రెడ్డి టీం జిల్లా అధ్యక్షులు  గూడ విజయ్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి , పందిర్ల లింగం గౌడ్, కురుట్లపేట మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం,  మండల కిసాన్ సెల్  అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడీది రాజేందర్,  మండల అధ్యక్షులు బానోత్ రాజు నాయక్   ,బిసి సెల్ మండల అధ్యక్షులు అనవేణీ రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండాపూర్ శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, నంది కిషన్ , వడ్నాల ఆంజనేయులు ,  గుర్రం రాములు ,మెండె శ్రీ నివాస్  యాదవ్ , గంట బుచ్చా గౌడ్, రమేష్ , మెహబూబ్, నవాబ్ ,  బొప్పాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కిష్టారెడ్డి ,  గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ , కోరుట్లపేట గ్రామ శాఖ అధ్యక్షులు మేడిపల్లి రవి ,  గ్రామ శాఖఅనంతరం  పాల్గోన్న భక్త కోటికి ఆశీర్వచనములు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు,

.