సికింద్రాబాద్ లో దుమాల వాసి బలవన్మరణం

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన పాముల సాయితేజా ( 19 ) అనే యువకుడు మంగళవారం రాత్రి  తన ఇంటిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు, దుమాల గ్రామానికి చెందిన కడు నిరుపేద కుటుంబానికి చెందిన పాముల వనిత  గౌడ్ , భర్త సంతోష్ గౌడ్ .  8 సంవత్సరాల క్రితం మరణించడంతో  బ్రతుకు దెరువు కోసమని సికింద్రాబాద్ లోని బోయిని పిల్లి లో  తన ముగ్గురు కుమారులు  బన్నీ , సాయి తేజా , అరవింద్ లతో  కలిసి అద్దె ఇంటిలో ఉంటుంది, బన్నీ ఫ్లీఫ్ కార్టు  ప్రైవేట్  కంపెనీలో పని చేస్తుండగా సాయి తేజా  అనారోగ్యంతో బాధపడుతున్నాడు  ఆమే చిన్న కుమారుడు అరవింద్  హైదరాబాద్ లో  ఐటిఐ చేస్తున్నాడు, 

మానసికంగా ‌శరీరకంగా  బాధపడుతున్న సాయి తేజా  జీవితంపై విరక్తి చెంది  మంగళవారం రాత్రి అద్దె ఇంటి పై  భాగానా అంతస్తులో  తాడుతో  ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు, సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు మృతదేహాన్ని స్వగ్రామ మైన  దుమాల గ్రామానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తరలించి అంత్యక్రియలు సాయంత్రం వరకు  నిర్వహిస్తామని  స్థానిక గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు,

.