నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర బిఆర్ఏస్ నాయకులు

తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని  సోంపూర్, టాక్లి, దోమలేడ్గి శివారులో   వడగళ్ల వాన కురవడంతో  నష్టపోయిన పంట పొలాలను బిఆర్ఎస్   రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడు గ్రామాలలో సుమారు 400 ఎకరాలు పంట నష్టం జరిగిందని అన్నారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ అధికారితో మాట్లాడుతూ రైతుల పంట పొలాలను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు. ఆయన వెంట జెడ్పిటిసి శంకర్ పటేల్, ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఎజాజ్ ఖాన్, నాగరాజుగౌడ్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్ చాకూరి గంగాధర్ పటేల్ , దిగంబర్ పటేల్, రాంబాబు, సత్యపాల్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు  ఏఈఓ సందీప్ తదితరులు ఉన్నారు.

.