తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి, తక్షణమే ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.
