తెలంగాణ ప్రభ,తంగళ్ళపల్లి: తంగళ్ళపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు పెద్దూరు తిరుపతి ఆదివారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్నకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి గత పదేళ్లుగా అన్ని కార్యక్రమాల్లో ముందుండి సేవలందించానని, తాను కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీ సహకారం చేయలేదన్నారు. దీంతో మానసికంగా చాలా ఇబ్బందులకు గురై పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.
