టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): కొంపల్లి మున్సిపాలిటీ లో బీమా ఫ్రైడ్ గేటెడ్ కమ్యూనిటీ జోహార్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ లో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యమని ఆమె అన్నారు. ఈ పది సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని నరేంద్ర మోడీ సర్వనాశనం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కులను కాలరాస్తూ వారి మనుగడ లేకుండా చేస్తున్నారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలిపించుకొని మన మల్కాజ్గిరి పార్లమెంటును దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
