మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కి శుభాకాంక్షల వెల్లువ..

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్బంగా  ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు  మహిళలు, అభిమానులు గాజులరామారం లోని క్యాంప్ కార్యాలయంలో కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. కూన శ్రీశైలం గౌడ్  తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

.