ఘనంగా భారతీయ జనతా పార్టీ దినోత్సవం వేడుకలు

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు వేముల నవీన్ ఆధ్వర్యంలో  జెండాను ఆవిష్కరించి బిజెపి పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. వేముల నవీన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రపంచంలో ప్రజా ధారణ పొందిన పార్టీ బిజెపి పార్టీ అని కొనియాడారు . గ్రామాలలో మండలాలలో నియోజకవర్గాలలో పార్టీలకతీతంగా బిజెపి పార్టీలో చేరుతున్నారని అన్నారు. బిజెపి పార్టీ గెలిపే ధ్యేయంగా కార్యకర్తలు అందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మండల పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ,గ్రామాలలోని శక్తి కేంద్రం ఇన్చార్జులు కలిసికట్టుగా పనిచేసి  జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి, దేశంలో మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  బాన్సువాడ కో కన్వీనర్ కాపుగండ్ల శ్రీనివాస్, పుల్లెల మోహన్ రావు, గోగినేని శ్రీనివాసరావు శ్రీనివాస్, మాశెట్టి  ఆదిత్య, కన్నం దావులయ్య, మామిడి శ్రీను,నాగేల్లి శ్రీనివాస్, డాన్ శ్రీను,ఎత్తోండ జగదీష్, విలాస్, జ్యోతి,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

.