తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సి.ప్రభాకర్ గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు గ్రంథాలయ అధ్యక్షులు చెన్న విశ్వనాథం అధ్యక్షతన నిర్వహించారు, వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బీహార్ 1908 ఏప్రిల్ 5 న బీహార్ లోని చంద్వా గ్రామంలో జన్మించారు , అతను భారత నాలుగవ ఉప ప్రధాని, అంటరానివారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించి కీలక పాత్ర పోషించాడు, దేశ హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించాడు1952 నుంచి ఆయన చనిపోయిన 1986 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, దేశంలో ఎక్కువ కాలం పని చేసిన మంత్రిగా రికార్డ్ సృష్టించారు, భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయ సూత్రల యొక్క ప్రాముఖ్యతపై అధిక ప్రాధాన్యత ఇచ్చిన కొద్దిమందిలో ఈయన ఉన్నారు, అని వారు చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు సమీర్, గంగాధర్, తుక్కా రామ్, నాగరాజ్, బాలే మారుతి, తదితరులు పాల్గొన్నారు
.