తెలంగాణ ప్రభ (కోరుట్ల): నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు కోరుట్ల ఆర్యవైశ్యుల మద్దతు కోరారు.
జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్య వైశ్యులను గుర్తించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆనతి కాలంలోనే ఆర్యవైశ్యులకు కార్పోరేషన్ ను ప్రకటించిందని ఆయన అన్నారు.
అందులో భాగంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త సురేష్ ని తన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి వచ్చె లోక్ సభ ఎన్నికలలో జీవన్ రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించేలా కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఆర్య వైశ్య నాయకులు కొత్త సురేష్ జువ్వాడి నర్సింగరావు ని శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు కొత్త సుధీర్, వుత్తూరి మారుతి, శ్రీపతి సోమశేఖర్, కొత్త సునీల్, కౌన్సిలర్ ఎంబెరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం వేణు, ఆడెపు మధు, ఎం.డి. అన్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గడ్డమీద వేణు, రంగారావు, నేమూరి భూమయ్య, మచ్చ కవిత, గుర్రాల అమరేందర్, చేదల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
.