తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు.మండేపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించుటకు గాను 800 సంవత్సరాల చరిత్ర కలదు.ఈ సందర్భంగా గౌడ సంఘం నుండి అమ్మవారు ఊరేగింపుగా ఉదయం పుట్టకు దని పోయిట నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఇంటింటి నుండి అమ్మవారికి బోనాలు నిర్వహించి,లందే నుండి ఎల్లమ్మను ఎదుర్కొని గడ ఊరేగింపుగా దాయితమ్ములతో,డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని కొనసాగించారు.బుధవారం రోజున గావు పట్టుట సిద్ధులు తిరుగుట అమ్మవారి కళ్యాణం ఉంటుంది కాబట్టి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి అమ్మవారిని దర్శించుకోవాలని గౌడ సంఘం నాయకులు తెలిపారు.
