తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా ఎకిన్ పూర్ శ్రీ మేడలమ్మ కేతమ్మా సహిత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉత్సవ మూర్తుల శోభయాత్ర అఖండ దీపారాధన కార్యక్రమం గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి జంటగా మంగళహారతితో జంటలు పాల్గొనగా అర్చకుల వేదమంత్రాలతో ఒగ్గు కళాకారుల విన్యాసాలతో ఉత్సవ విగ్రహాలను బస్టాండ్ సమీపంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి మల్లికార్జున స్వామి ఆలయంవరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అఖండ దీపారాధన చేశామని అర్చకులు పేర్కొన్నారు.
స్థాపితా పూజ రుద్రహోమము ద్వాదశ కలశా స్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, గురువారం స్థాపిత దేవత పూజ శ్రవణ నక్షత్ర యుక్త వృషభ లగ్న శుభముహూర్తమున యంత్రస్థాపన మూలమూర్తుల విగ్రహ స్థాపన శాంతి కళ్యాణం గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గం నుండి అనేక గ్రామాల ప్రజలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
ఇట్టి మేడలమ్మ కేతమ్మ సహిత శ్రీ మల్లికార్జున స్వామి నూతన ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గ్రామ ఆచార కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు పిలుపునిచ్చారు.
.