కాంగ్రెస్ పార్టీ లో చేరిన అయిలాపూర్ సింగిల్ విండో ఛైర్మెన్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  జువ్వాడి నర్సింగ రావు ఆధ్వర్యంలో అయిలాపూర్ సింగిల్ విండో ఛైర్మెన్ చింతకుంట సాయిరెడ్డి మరియు సింగిల్ విండో డైరెక్టర్లు ఏలేటి మల్లారెడ్డి, నల్ల నర్సు, అనంతం, ఆవునూరి గంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ బండ్ల సరోజన, కుంటాల వికాస్ తదితరులు కాంగ్రెస్  పార్టీలో చేరారు. 

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కొంతం రాజం, ఎంపీటీసీ-2 చింతకుంట వనిత సంజీవ్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు నక్క సుధీర్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శశింధర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, సీనియర్ నాయకులు గడ్క సందయ్య,నగునూరు గంగాధర్, గడప శంకర్,  కరిపెల్లి అజయ్ రెడ్డి, గోపిడి నారాయణ, ఏలేటి పుల్లారెడ్డి, బాధ విజయ్, మారుపాక సుమన్,ముక్కెర రాజేష్, గడ్డం హన్మక్క, ఎనుగందుల పద్మ, మహేష్, రాజు, రాజేందర్, శివ, మధు, పన్నాల లింగారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

.