ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి పూల బొకేలు అందజేసిన జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు జగిత్యాల పట్టణ జీవన్ రెడ్డి స్వగృహం ఇందిరా భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందజేశారు ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతోపాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.