తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులు, యువ ఓటర్లు, మహిళలు, వికలాంగ ఓటర్లు, సీనియర్ సిటిజన్లు, థర్డ్ జెండర్స్ వంటి మార్జినల్ ఓటర్లు సముచితంగా పాల్గొనే విధంగా బుధవారం రోజున 5కే రన్ కార్యక్రమం జరిగింది.
5 కే రన్ కార్యక్రమం లో పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు ప్రజలందరూ పాల్గొన్నారు, ఓటు ఎలా వేయాలి అని చెప్పి ఈ 5కే రన్ సందర్భంగా సదస్సు ఏర్పాటు చేశారు.
ప్రతి యువత 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు వేసే హక్కు గురించి చెప్పడం జరిగింది. ట్రాన్స్ జెండర్స్ కూడా దీని గురించి వాళ్లకు అవగాహన ఉన్నది. పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్, నంది చౌరస్తా దాకా 5K రన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ 5కే రన్ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద కుమార్, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, తహశీల్దార్ ఇ.కిషన్ సీనియర్ సిటిజన్స్, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ లోని బీఎల్ వో లు, మున్సిపల్ ఆర్పీలు, రెవెన్యూ , మండల పరిషత్, లోకల్ బాడీ, అన్ని డిపార్ట్మెంట్ ల ఉద్యోగులు, విద్యాసంస్థల యాజమాన్యం, విద్యార్థులు, ఓటర్ అవగాహన సదస్సు, 5K రన్ కార్యక్రమం నిర్వహించారు.
.