బోరున విలపిస్తున్న ప్లాట్ యజమానులు*:
ఆలయం పేరుతో అడ్డగోలుగా కబ్జా:
కాపాడే తల్లి పేరుతో ప్లాట్లు స్వాధీనం:
అంగ బలం, అర్ధ బలంతో రెచ్చిపోతున్న స్థానిక నాయకులు:
కోర్ట్ ఆర్డర్ వారికి కాలి గోటితో సమానం:
బాధితుల తరుపున సామజిక ఉద్యమకారుల పోరాటం:
బౌరంపేట్ సతీష్ లే అవుట్ పేరుతో గుడిని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం:
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) తమకు అండగా ఉంటుంది అనుకున్న ఆ బంగారు మైసమ్మ తల్లి పేరుతో వున్న ఆలయ కమిటీ పెద్దలు తమ గూడు చెదరరగోడుతుంటే కడుపు మాడ్చుకొని రెక్కల కష్టంతో కాసింత భూమి జాగా కొనుకొన్న మధ్య తరగతి ప్రజలు ఆ తల్లి పేరు చెప్పి తమ ప్లాట్లను కబ్జా చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దుండిగల్ గండి మైసమ్మ మండలం బౌరంపేట్
సర్వేనెంబర్ 254 పార్ట్ టు సర్వేనెంబర్ 260 సతీష్ నగర్ లో రిజిస్ట్రేషన్ ప్లాట్ లలో కూడా దౌర్జన్యం చేస్తున్న భూ కబ్జాదారులతో వారికి సహకరిస్తున్న అధికార యంత్రంగం తో లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు.
భూ కబ్జాదారులకు సహకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది
దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుత్సాహం వల్ల లక్షలు నష్టపోయిన సదరు భూ యజమానులు ఏ దిక్కు లేక ఆ బంగారు మైసమ్మ తల్లి అయినా తమ కుటుంబాలను కాపడుతుందా అని ఎదురు చూస్తున్నారు.కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గండి మైసమ్మ మున్సిపల్ పరిధిలో బరంపేట్ లో సర్వేనెంబర్ 254 పార్ట్ నుండి సర్వేనెంబర్ 260 పార్ట్ వరకు 1985లో సతీష్ లే అవుట్ వేయడం జరిగింది అప్పట్లో మధ్య బీద మధ్యతరగ ప్రజలు చాలామంది ప్లాట్లను కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ వెంచర్లో బంగారు మైసమ్మ గుడి స్థాపించి స్థానికులు పూజలు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ ఈ ప్లాట్ యజమానులు అక్కడ ఏదో విధమైన కన్స్ట్రక్షన్ చేద్దామని పోతే లోకల్ నాయకుల చేత గుండాల చేత బెదిరించి వాటిని డెమోలిష్ చేయిస్తున్నారు. సదరు యజమానులందరూ కోర్ట్ కు వెళ్లి కోర్టు ద్వారా ప్రవేశం తెచ్చుకున్నా కూడా లోకల్ మున్సిపల్ అధికారుల చేత డిమాలిష్ చేయించి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ప్లాట్ నెంబర్ జి 27 యజమాని రామచంద్రయ్య అనే వ్యక్తి సుమారు 78 సంవత్సరాల వయస్సు ఈ వ్యక్తి తన ప్లాట్లు కాంపౌండ్ వాల్ నిర్మించుకుందామని సామాగ్రి వేసి పనులు చేస్తున్నప్పుడు సదరు మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎవరు చెప్తే వచ్చి డిమాలిస్ చేశారనేసి ఇట్టి విషయమై మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయగా కమీషనర్ కి తెలియకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అని ప్లాట్ యజమాని రామచం ద్రయ్య వాపోయారు, జల్దీయాలి మున్సిపల్ పరిధిలో ఎన్ని భూకబ్జాలు జరుగుతున్నాయి ఎన్ని అనుమతి లేని అంతస్తులు నిర్మిస్తున్న పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు ఖాళీ కాంపౌండ్ వాల్ నిర్మిస్తే వచ్చి డిమాలిస్ చేస్తున్నారని ఇట్టి విషయమై పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ చేసి తమకు న్యాయం చేయాల్సిందిగా పత్రిక ముఖంగా తెలియజేశారు.
.