సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించేoదుకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులను పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 8363 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని అన్నారు. అందులో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులున్నారు. ర్యాండమైజేషన్ ద్వారా నియమించిన వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మజా రాణి , జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిఐఓ -ఎన్ఐసి విద్యాసాగర్, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
.