కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి మాజీ పట్టణ అధ్యక్షులు జక్కుల ప్రసాద్ దంపతులు

పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జువ్వాడి నర్సింహారావు 

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ పద్మశాలి కులోన్నత సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు జక్కుల ప్రసాద్ లలిత దంపతులతో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన వాజీద్ లు మంగళవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జువ్వాడి నర్సింహారావు ఈకార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం,  బి సి సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడేపు మధు, ఎంబేరి సత్యనారాయణ, మార్గం ప్రతాప్, పోతుగంటి శంకర్ గౌడ్, తుపాకుల బాజన్న, అవునురి కాశీరెడ్డి, పసుల కృష్ణప్రసాద్, కటుకం దివాకర్, పెంట అశోక్, అంజిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.