ప్రభుత్వం గీతా కార్మికులకు గీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం డిమాండ్. 

తెలంగాణ ప్రభ  (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారి సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ బొమ్మ గాని ధర్మాభిక్షం 13వ. వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర గీతా పని వాళ్ళ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ. విటల్ గౌడ్ మాట్లాడుతూ.... గీతా కార్మికుల కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు  ధర్మ బిక్షం ఆని కొనియాడారు. వారి చివరి శ్వాస దాకా గీత కార్మికుల కుటుంబం కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు అని అన్నారు. కామ్రేడ్ ధర్మ బిక్షం  గీత సొసైటీలో ఏర్పాటుకై గీత కార్మికుల సంరక్షణకై ఎన్నో ఉద్యమాలు చేసి కార్మికుల హక్కుల కోసమై పోరాడిన మహానీయుడు ,   ధర్మబిక్షం  విగ్రహం ట్యాంక్ బ్యాండ్ పై నెలకొల్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు ప్రజల మనిషి గీత కార్మికుల కుటుంబాల ఆశాజ్యోతి ధర్మ బిక్షమని అన్నారు. ఈ వర్ధంతి సభ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు శ్రీధర్ గౌడ్, వెంకా గౌడ్, పండరి గౌడ్, సురేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

.