హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రెస్ క్లబ్ సభ్యులు..
తెలంగాణ ప్రభ (కోటగిరి): మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఒకరినొకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వారు వీధుల గుండా తిరుగుతూ ప్రజాప్రతినిధులకు కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ,రంగులను చల్లి ఆనంద ఉత్సవాలతో హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పుప్పల సాయిలు,కృష్ణ, పెంటయ్య, రాములు సైదయ్య శ్రీకాంత్ అనిల్ రాజు,బి.సాయిలు, ఇందూర్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
