మండల కేంద్రంలో ఘనంగా హొలీ సంబరాలు.

హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎస్.ఐ. సందీప్, గ్రామ యువకులు...

తెలంగాణ ప్రభ. (కోటగిరి):  మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో , కోటగిరి మండల కేంద్రంలోని బ్రాహ్మణ గల్లిలో, ఆయా గ్రామాలలో యువకులు  హోలీ పండగ   సంబరాలు  ఘనంగా జరుపుకోన్నారు.గ్రామాలలోని చిన్నా,పెద్దా అని తేడా లేకుండా యువతీ,యువకులతొ పాటు గ్రామస్థులు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ  పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.శనివారం రాత్రి మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో , ఆయా గ్రామాలలో గ్రామ దేశాయ్ వారి  సమక్షంలో  కామ దహనం చేశారు. మండలంలో ఆదివారం కామ దహనం చేస్తూ, సోమవారం నాడు  అన్ని గ్రామాల్లో హొలీ పండగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో  తెల్ల రవి, కప్ప సంతోష్,శ్రీకాంత్,అరుణ్ గౌడ్,విట్టల్, గగన్, శ్యామ్, పుప్పాల శంకర్,భూపెందర్, సర్పంచులు లింగాపూర్, హనుమంత్, ఏఎంసీ ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి వివేక్ ప్రెస్ క్లబ్ సభ్యులు కృష్ణ,  రాములు, సైదయ్య ,శ్రీకాంత్ అనిల్, రాజు, సాయిలు, సంతోష్, వేణు,యోగేశ్వర్ తదితరులు గ్రామ యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

.