నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు వెల రూపాయలు జరిమానా

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాహనాలు కలిగిన వారికి మీటింగ్ లు నిర్వహించి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను తప్పనిసరి గా FSTP నందు వేయాలని తెలపడం జరిగింది. 

కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి నాగయ్య సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ సెప్టిక్ ట్యాంకు వ్యర్ధాలను కోరుట్ల శివారులోని కల్లూరు రోడ్ లో వేయడం జరిగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడకు వెళ్లి వారికి 5000 జరిమానా విధించి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. 

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాహనాలు కలిగిన వారు తప్పనిసరిగా మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలని, మరియు వారు సేకరించిన సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను యేసుకోనీ గుట్ట నందు గల FSTP నందు మాత్రమే వేయగలరు.బహిరంగ ప్రదేశాలలో వేసినట్లయితే భారీ జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, J.రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

.