గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్న పేట భాస్కర్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి జాతీయ స్థాయి సామాజిక ఉద్యమనేత జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రజాసంఘాల జేఏసీ,అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. 

ఆదివారం హైదరాబాద్  ఆర్టీసీ క్రాస్ రోడ్లోగల సిటీ కల్చరల్ ఆడిటోరియంలో యూనివర్సిటీ కో- ఆర్డినేటర్,స్పూర్తి సర్వీసెస్ సోసైటీ ఇండియా ఎన్జీవో చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ ,తెలంగాణ పంచాయతీరాజ్ మాజీ డైరెక్టర్ డా కే యాదయ్య గౌడ్,డా ప్రతీమరాజ్ చేతుల మీదుగా పేట భాస్కర్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ ఈ అవార్డుతో నాపై మరింత బాధ్యత పెరిగిందని గత ముప్పై రెండు సంవత్సరాలుగా చేస్తున్న అనేక సామాజిక ఉద్యమాలకు గుర్తింపుగా ఈ అవార్డును నా గుండె అరల్లో భద్రపర్చుకుంటానన్నారు.  అప్పటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ గా ప్రారంభమైన ప్రస్థానం అక్షర జ్ఞానమే ఆయుధమంటు ప్రజాదండోర పత్రిక సంపాదకులుగా, సామాజిక, ప్రజా ఉద్యమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో సైతం ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా క్రియశీలకంగా వ్యవరించానని  స్థానికంగా కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన తీరు తనను ప్రజల్లో చిరస్థాయిగా నిలుపుతుందని పేట భాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ జాతీయ స్థాయిలో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నందుకు గాను సోషల్ సర్వీస్ కేటాగిరిలో ఈ డాక్టరేట్ అవార్డు రావడం జీవితంలో గొప్ప అనుభూతిని,ఆనందాన్ని నింపిందని సహకరించిన మిత్రులందరికీ పేట భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.

.