ఏ ఒక్క రైతు అధైర్య పడొద్దు..అండగ ఉంటం: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం కేకే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని ఆయన అన్నారు.గత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందనీ మండిపడ్డారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా పంట నష్టపోయిన ప్రతిఒక్క రైతును ఆదుకొని అండగా ఉంటామన్న ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా కలెక్టర్,సంబంధిత అధికారులతో మాట్లాడి పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరమని ఆయన అన్నారు.పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాన రూ.10 వేలు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందివ్వనున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ, మండల కాంగ్రెస్ నాయకులు గుగ్గిళ్ల శ్రీకాంత్,కటకం రాజశేఖర్,కొత్త రవి,పొన్నం లక్ష్మణ్ గౌడ్,గోగు తిరుపతి,ఓగులపూర్, గండి లచపేట,వేణుగోపాల్పుర్,గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, రాజు,లక్ష్మణ్,రైతులు ఉన్నారు.

.