నేరెళ్లలో దళితులవద్దకు ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకొని వస్తారు

అమరుల త్యాగాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణలో దౌర్భాగ్య పాలన కొనసాగింది

త్యాగాలు చేసింది సబ్బండ వర్గాల ప్రజలయితే భోగాలు భోగించుకున్నది దళారి వెలుమా కాందాని

ఇసుక స్మగ్లింగ్ పై అడిగినందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి దళితుల బతుకులు ఆగం చేశారు

దళిత లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షులు మార్వాడి సుదర్శన్

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): అమరుల త్యాగాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్య  పాలన కొనసాగిందని త్యాగాలు చేసింది సభండా వర్గాల ప్రజలయితే భోగాలు అనుభవించింది వెలమ కాందాని బిఆర్ఎస్ కాందాని అని దళిత లిభరేషన్ ప్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మార్వాడి సుదర్శన్ తీవ్రంగా విమర్శించారు ,

సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్ల గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దళిత లిభరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ ఇసుక  గ్రానైట్స్ స్మగ్లింగ్ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ నేతృత్వంలో చేసి  కోట్లాది రూపాయలు కూడా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు,

ఇసుక స్మగ్లింగ్ వేలాది లారీలు హైదరాబాదు వెళుతున్నాయి రోడ్డు ఎలా దాటాలి మా బతుకులు ఎట్లా అని దళితులు అడిగినందుకు అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి దొరకు పాలేరుగా పనిచేసినట్లు దళితులపై థర్డు డిగ్రీ ప్రయోగించి వాళ్ళ బతుకులను ఆగం చేసినాడని ఆయన ఆరోపించారు,

బెస్ట్ సర్పంచ్ అవార్డు గ్రహీత బాలయ్య ను అప్పటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్మానించారని ఢిల్లీలో అవార్డు పొందిన గొప్ప వ్యక్తి అని,  నరేష్ బాధితుడు ఎస్సైగా సెలెక్ట్ అయినాడని అతని బ్రతుకును కూడా ఆగం చేశారని అదేవిధంగా బాదితుడు ఈశ్వర్  బ్రతుకును  నాశనం చేశారని ఆయన ఆరోపించారు ,

అప్పటి ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ దళితులకు అన్యాయం జరిగింది న్యాయం చేస్తామని చెప్పి  అదేవిధంగా  ఎంపీగా గెలుపొందిన బిజెపి బండి సంజయ్ బీసీ బిడ్డ అని గెలిపిస్తే దళితులకు న్యాయం చేస్తానని చెప్పి న్యాయం చేయలేదని అటువంటి వ్యక్తులు ఏ మొహం పెట్టుకొని ఓటు అడగడానికి నేరెళ్ల దళితుల వద్దకు వస్తారని ఆయన ప్రశ్నించారు, 

నేరెళ్ల బాధితుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో , పార్లమెంటులో మాట్లాడినప్పటికీ దళితులకు న్యాయం జరగలేదన్నారు,

నేరెళ్లలో దళితులకు బీసీలకు న్యాయం జరగాలని అప్పటి ఎస్ సి ఫై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు,

.