అంతర్జాతీయ జల దినోత్సవం

నీటి వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

పాల్గొన్న పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ 

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సూరారం కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్త్ సిటీ పాఠశాలలో నీరును ఎలా పొదుపు చేయాలని  విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ పాల్గొని విద్యార్థులకు వర్షపు నీటిని ఏ విధముగా పొదుపు చేసి వాడుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు చిన్న పిల్లలకు స్నానం చేయించే విధానం మొక్కలకు ఏ విధంగా నీరు పోయాలి విద్యార్థులు పెద్దలు మంచినీరు తాగేటప్పుడు చిన్న గ్లాసులనే వాడాలని పెద్ద గ్లాసులు వాడడం వల్ల నీరు వృధాగా పోయి భవిష్యత్ తరాలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఎట్టి పరిస్థితుల్లో మంచినీళ్లు వృధా చేయరాదని  తెలిపారు ఇదే అవగాహన కార్యక్రమంలో భవిష్యత్తులో నీటిని వృధా చేయమని మా బంధువులకు తల్లిదండ్రులకు ఇరుగుపొరుగు వారికి తెలియజేస్తామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కోలా రవీందర్ ముదిరాజును ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆయనను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు.

.