డిప్యూటీ సీఎం, వ్యవసాయశాఖ మంత్రితో చర్చించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
తెలంగాణ ప్రభ ( మెదక్ ): మెదక్ నియోజకవర్గంలోని నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ గాలులతో వడగండ్ల వాన కురిసిన విషయం విధితమే. ఈ విషయమై బుధవారం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ముఖ్యంగా వరి పంటతో పాటు మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో దెబ్బతిన్న విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయమై తక్షణమే జిల్లా కలెక్టర్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి పంట నష్టపోయిన వివరాలను సేకరించాలని సూచించారు. ఇదిలా ఉండగా గురువారం హైద్రాబాద్ లోని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ తో మెదక్ నియోజకవర్గంలో జరిగిన పంట నష్ట వివరాలను వెళ్ళడించారు. ఈ విషయమై స్పందించిన మంత్రులు నష్టపోయిన రైతులకు ఎకరం పంటకు 15 వేల రూపాయల నష్టపరిహారం అందిస్తామని హామినిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
