పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాను... కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్
తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గొర్రె రంజిత్ అనే దళిత యువకుడిపై మరియు వారి తండ్రి మల్లేష్ పై కాంగ్రెస్ నాయకుడు, మాజీ జెడ్పిటిసి కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్పులతో మరియు కర్రలతో దాడి చేయగా తీవ్ర గాయాలతో ఉన్న విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మరియు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ బాధితులతో కలిసి మెట్ పల్లి DSP కి పిర్యాదు చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బలహీనవర్గాల మీద దాడులు ఎక్కువయ్యాయని, పేగులు మేడలేసుకుంటా, పండబెట్టి తొక్కుతా అని సీఎం రేవంత్ మాటల్లో అంటే చేతల్లో కాంగ్రెస్ నాయకులు చూపిస్తున్నారని వారి అన్నారు.
కాంగ్రెస్ నాయకులు దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారని, పదవి శాశ్వతం కాదని వారు అన్నారు.
కార్యకర్త దాడికి గురైన విషయం తెలుసుకున్న కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు DSP కార్యాలయానికి చేరుకొని బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
.