ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవెనీ సునీల్
తెలంగాణ ప్రభ (కోరుట్ల): పదో తరగతి పరీక్షల కేంద్రాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేని సునీల్ అన్నారు
పరీక్షలు రాసే విద్యా ర్థులకు పరీక్ష కేంద్రాలలో వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, త్రాగు నీరు, సరియైన సదుపాయం కల్పించాలని, రూంలలో పరిశుభ్రత పాటించాలని ఆయన కోరారు.
అలాగే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు పరీక్ష సమయాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా భయం లేకుండా నిశ్చింతగా తాము చదివిన జవాబు పత్రాలలో వ్రాయాలని ఆయన సూచించారు.
అదేవిధంగా పరీక్షలు భయంతో కాకుండా ప్రశాంత వాతావరణంలో బాధ్యత తో వ్రాయాలని ఆయన అన్నారు. విద్యార్థులకి త్రాగు నీరు, ఏర్పాటు చేయాలనీ పాఠశాల యాజమాన్యంలను ఆయన కోరారు
10వ తరగతి విద్యార్థులకు పరీక్షలలో విజయం కలగాలని ఆయన ఆకాంక్షించారు
.