మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు నేడు నిజాంపేట మండలంలో పర్యటన
తెలంగాణ ప్రభ ( మెదక్ ): సోమవారం రాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వానతో మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో పంటలు ధ్వంసం అయి నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బుధవారం నిజాంపేట మండలంలోని బచ్చురాజపల్లి, జడ్చర్ తాండాతో పాటు నిజాంపేట మండల కేంద్రంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను పరామర్శించనున్నట్లు ఆయన తెలిపారు.
