సోష‌ల్ వెల్పేర్ బాలిక‌ల డిగ్రీ క‌ళాశాల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ రాహుల్‌రాజ్‌

తెలంగాణ ప్ర‌భ ( మెద‌క్ ): మెద‌క్ జిల్లా కేంద్రంలోని పిల్లికొటాల్లో ఉన్న‌ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను మంగ‌ళ‌వారం మెద‌క్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప‌రిశీలించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల పనితీరు ఆదర్శనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా.కళాశాల నిర్వహణ పనితీరును, కోర్సుల వివరాలు, గతంలో విద్యార్థుల పాస్ పర్సంటేజ్ వైస్ ప్రిన్సిపల్ సబితను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాలలో 665 మంది  విద్యార్థినులు వివిధ కోర్సులలో విద్యను అభ్యసిస్తున్నారని అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీల ద్వారా ఉత్తమ విద్యా బోధన అందిస్తూ విద్యా నైపుణ్యాలను మెరుగుపరిచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట తహ‌సిల్దార్ శ్రీనివాస్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ స‌బిత ఉన్నారు.

.