తెలంగాణ ప్రభ ( మెదక్ ): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల( బాలికల) లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్
వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని, డీఈఓ, చీఫ్ సూపరింటెండెంట్ ల నుండి పరీక్షా విధుల్లో ఉన్న అందరిని, వైద్య శిబిర వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు. ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు.
.