మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజును మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మేడ్చల్ మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన శంబిపూర్ రాజు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం కేసీఆర్ ఉద్యమకారులను ఎప్పటికీ మరువరని మరో మారు రుజువైందని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు యువనేత శంబిపూర్ రాజును మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పలువురు ధీమ వ్యక్తం చేశారు.

.