కదన బేరికి తరలిన గ్రామస్తులు

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ లో తలపెట్టిన చలో కదనభేరి బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట మండలం నుండి వివిధ గ్రామాల నుండి  ప్రజా ప్రతినిధులు  బస్సుల్లో గ్రామస్తులను తరలించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి ఐదు బస్సుల్లో  ఎంపీటీసీ 1 ఆధ్వర్యంలో సుమారు 300 మందిని  కదన బేరి బహిరంగ సభకు తీసుకువెళ్లారు. బస్సుల్లో వెళ్లిన వారిలో  మండల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ లీడర్లు, యూత్ నాయకులు, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్ అధ్యక్షులు, మండల మహిళా అధ్యక్షురాలు, గ్రామ శాఖ అధ్యక్షురాలు, బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులు  ఉన్నారు.

.