తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): పదో తరగతి విద్యార్థు లు ఉత్తమ ఫలితాలు సాధించారు జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. సోమవారం కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శివనగర్ సిరిసిల్లలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాజిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ హాజరయ్యారు.పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి డీఈవో రమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి గతంలో 10వ తరగతి 10gb సాధించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఏ విధంగా కష్టపడ్డారో వారిని ఆదర్శంగా తీసుకొని చదవాలని కోరారు.కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. మోతిలాల్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ శ్రీ మల్లారపు పురుషోత్తం, ఉపాధ్యాయులు పాతూరు మహేందర్ రెడ్డి, పాకాల శంకర్ గౌడ్, కుమ్మరి మల్లేశం,శ్రీహరి, సాంబయ్య, లక్ష్మయ్య, నారాయణ, ప్రభాకర్, నసీరుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, లింగమూర్తి, వెంకటస్వామి, కే. సరిత, సంధ్యారాణి, ఫాతిమా, నీరజ,సత్య కుమారి, వెంకటస్వామి10వ తరగతి 9వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.
.