తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ మండలం లోని సిరికొండ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సాయంత్రం 5 గంటలకు పాల్గొంటారని మానకొండూరు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ తెలిపాడు, ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపాడు.
