జోగిన్ పల్లిలో గృహజ్యోతి పథకాన్ని ఆరంభించిన కాంగ్రెస్ నాయకులు.
కరెంట్ భారం ఇక చెల్లు పేదవారి ఇంట ఆనందం హరివిల్లు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 27వ తేదీన 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకంకు శ్రీకారం చుట్టిన సంగతి అందరికీ తెలిసిందే, ఈ పథకం ప్రయోజనాలు ఈనెల నుంచి అమల్లోకి వచ్చాయి, గృహ జ్యోతి పథకం కింద మండల వ్యాప్తంగా అర్హులైన విద్యుత్ వినియోదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు జీరో బిల్లులు జారీ చేస్తున్నాయి, మీటర్ రీడింగ్ లో తీసుకున్న సిబ్బంది 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగించిన అర్హులకు గృహజ్యోతి జీరో బిల్లులను అందజేస్తున్నారు,
జీరో బిల్లులు అందుకున్న వినియోదారులు ఎలాంటి బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని, కోరుట్ల మండల జోగిన్ పల్లి గ్రామంలో 200 యూనిట్ల లోపు వినియోగించిన ఓ వినియోదారుడికి బిల్లు రూ. 223 కాగా, ఆ మొత్తం స్థానంలో జీరో బిల్లును జారీ చేశారు బిల్లు చిట్టిలలో గృహజ్యోతి సబ్సిడీ కింద ఆ మొత్తాన్ని మైనస్ చేస్తున్నారు, జీరో బిల్లు జారీ చేసినందుకు,జోగిన్ పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిట్టు సహదేవ్ మాట్లాడుతూ. ప్రారంభమైన ఈ ప్రక్రియ మరికొద్ది రోజుల్లోనే మండల వ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పారు, అయితే గృహజ్యోతి స్కీమ్ కింద విద్యుత్ వినియోదారులకు అందిస్తున్న సబ్సిడీ వ్యయాన్ని కవర్ చేయడానికి డిస్కమ్ లు ప్రతినెల సబ్సిడీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని ఆయన తెలిపారు,
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండో రోజే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచింది, ఇక తాజాగా ఫిబ్రవరి 27న రూ. 500 కే గ్యాస్ సిలిండర్, పేద మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది,
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు తమకు ఓటు వేశారని, తాము ఇచ్చిన హామీలకు తప్పకుండా నెరవేరుస్తామని ఆయన అన్నారు, విపక్షాలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన తమ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని గ్రామ శాఖ అధ్యక్షుడు బిట్టు సహదేవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో, కోరుట్ల నియోజవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మైపాల్ రెడ్డి, గంగాధర్, హరీష్, ముత్యపు శేఖర్, బోయిని రమేష్, ఇంద్రాల అశోక్, తేలు రాజుకుమార్, తేలు శ్రీను , విద్యుత్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు,
.